చారకొండలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు
చారకొండ,సూర్య న్యూస్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించి దుర్గమాత అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. మండపం వద్ద మహిళలు కోలాటాలు, బతుకమ్మ తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారు మాలధారణ భక్తులు తొమ్మిది రోజుల పాటు నియమ, నిచిష్టలతో కఠోరమైన దీక్షలు చేస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అమ్మవారు మాలధారణ భక్తులు, స్వామి వివేకనంద యువజన భక్త బృందం, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.