BREAKING
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి*

రోగులకు మరింత మెరుగైన సేవలందిస్తాం. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కాయకల్ప అవార్డు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం

Select Suryaa Now
రోగులకు మరింత మెరుగైన సేవలందిస్తాం. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కాయకల్ప అవార్డు.  ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం

కల్వకుర్తి సూర్య న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు.శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో డాక్టర్ శివరాం మాట్లాడారు.రోగులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఆసుపత్రిలో పరిశుభ్రతను పాటిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకున్నందుకు రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు 88 శాతం స్కోర్ తో దక్కిందని తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ శివరాం హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే  ఆసుపత్రి చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పేరా మెడికల్, శానిటేషన్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఆసుపత్రికి 450 నుంచి 600 వరకు ఓపి పేషెంట్లు, 40 నుంచి 50 వరకు ఇన్ పేషెంట్లు, 400లకు పైగా రక్త పరీక్షలు, నెలకు వందకు పైన కాన్పులు, 30 వరకు జనరల్ సర్జరీ కేసులు, 58 మంది డయాలసిస్ రోగులు, రక్త నిల్వ కేంద్రం వంటి సేవలు మన 50 పడకల ఆసుపత్రిలో జరుగుతున్నాయని అన్నారు. రక్త పరీక్షలకు సరిపడా ల్యాబ్ కెమికల్స్, సర్జికల్స్ ఎక్విప్మెంట్స్, ఇన్ పేషెంట్ సంబంధించి కే సీట్లు సప్లై లేకపోవడంతో బయటి నుంచి ఆర్డర్స్ పై కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు, సకాలంలో హెచ్ డి స్ బడ్జెట్, ఆరోగ్యశ్రీ బడ్జెట్ రావడం లేదన్నారు. ఈ అంశంపై ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో చర్చించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినట్లు డాక్టర్ శివరాం తెలిపారు. ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులు, 8 మంది నర్సింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఆసుపత్రిలో 1025 డెలివరీ లు చేయగా వాటిలో సాధారణ ప్రసవాలు 70 శాతం అయినట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ శివరాం పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.