రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయుడికి గుర్తింపు
సూర్య చందుర్తి:మహబూబ్నగర్ జిల్లా భగీరథ కాలనీ, మాధవ్ నగర్లో నిర్వహించనున్న ఎస్జీఎఫ్ అండర్-14 బాల, బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం నర్సింగా పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు (పీడీ) జెట్టిపల్లి అశోక్ అబ్జర్వర్గా నియమితులయ్యారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల నిర్వహణలో అబ్జర్వర్గా ఆయన కీలక బాధ్యతలునిర్వర్తించనున్నారు. పోటీలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు క్రీడాకారులకు న్యాయబద్ధమైన పోటీ వాతావరణం కల్పించడంలో అబ్జర్వర్ పర్యవేక్షణ కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సందర్భంగా జెట్టిపల్లి అశోక్ ను గ్రామ సర్పంచ్,మండల విద్యాధికారి వినయ్ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు జితేందర్ , ఎస్జీఎఫ్ కార్యదర్శి రవీందర్ రావు ,ఉపాధ్యాయులు,గ్రామస్తులు అభినందించారు.