జాతీయస్థాయి క్యారమ్స్ పోటీలకు జూలపల్లి పీ హెచ్ సి ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మకంటి కిరణ్కుమార్ ఎంపిక
సూర్య జూలపల్లి
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయస్థాయి క్యారమ్స్ పోటీలకు జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న బొమ్మకంటి కిరణ్కుమార్ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు.2026–27 సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు అక్టోబర్ 7, 8 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించారు. ఈ పోటీల్లో క్యారమ్స్ విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన కిరణ్కుమార్ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.కిరణ్కుమార్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై మండల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సింగిల్ విండో సీఈవో గీస సురేష్, సిబ్బంది కరుణాకర్, శ్రీనివాస్,అనిల్ తదితరులు ఆయనను అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి తెలంగాణకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.