జోరుఅందుకున్న ఎన్నికల హడావుడి
ఇరగవరం సూర్య న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలు హడావిడి జోరందుకుంది. దీనికి సంబందించిన ఇప్పటికే ఎంపీటీసీ రిజర్వేషన్ ప్రకటించిన అనంతరం శుక్రవారం సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ విడుదల చేసారు.సర్పంచ్ 21స్థానాలకు ఎస్సీ.4స్థానాలు ,బీసీ.6స్థానాలు,జనరల్. 11స్థానాలు రిజర్వేషన్ ఖరారు చేసారు.అర్జునుడు పాలెం జనరల్ మహిళ,ఏలేటిపాడు జనరల్, గోటేరు జనరల్, ఐనపర్రు జనరల్, ఇరగవరం బీసీ మహిళ, ఐతంపూడి జనరల్, కాకిలేరు జనరల్, కె.ఇల్లందల పర్రు బీసీ, కె.కుముదవల్లి జనరల్ మహిళ,కంతేరు ఎస్సీ,కత్తవపాడు ఎస్సీ మహిళ,కావలిపురం జనరల్ మహిళ,కొత్తపాడు జనరల్, ఓగిడి ఎస్సీ,పేకేరు ఎస్సీ మహిళ,పొదలాడ బీసీ మహిళ,రాపాక ఎస్సీ మహిళ,రేలంగి బీసీ,సూరంపూడి బీసీ,తూర్పు విప్పర్రు జనరల్ మహిళ,ఎర్రయిచెర్వు బీసీ మహిళ రిజర్వేషన్ కేటాయించారు.మొత్తం మండలంలో 204 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ ఉత్తర్వులు జారి చేసారు.
రిపోర్టర్ దొరబాబు ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా,