ఒంటిపై స్కూల్ యూనిఫాం.. చేతిలో ఆటో స్టీరింగ్!
ఒంటిపై స్కూల్ యూనిఫాం.. చేతిలో ఆటో స్టీరింగ్!
రేణిగుంటలో మైనర్ బాలుడి ఆటో డ్రైవింగ్
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ మైనర్ బాలుడు ఆటో స్టీరింగ్ పట్టుకుని ఆటో నడుపుతున్న దృశ్యం (నేటి దినపత్రిక) సూర్య కి చిక్కింది. వాహనాలు నడిపేందుకు తగిన వయసు రాకముందే చిన్నారుల చేతికి స్టీరింగ్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రద్దీ రహదారులపై మైనర్లు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి చేతికి ఆటోను ఎవరు అప్పగించారు? మైనర్లతో వాహనాలు నడిపించకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి ఘటనలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.