BREAKING
అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు నాయకులు తరలి రండి ఎంపీడీవో : కిరణ్ కుమార్కొ తెలకపల్లి మండలంలో ఎండిన పత్తి పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు.. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి ఓటరు నమోదు దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి లేని రోజున వసూళ్లు చేసిన కాంట్రాక్టుపై విచారణ జరిపి, కాంట్రాక్టును రద్దు చేయాలి విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్థన' మూవీ: కీర్తి సురేష్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల! ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మన సంస్కృతి మన సంప్రదాయం మన బతుకమ్మ, గడ్డంపల్లిలో బతుకమ్మ ఘాట్ పనులు ముమ్మరం,గడ్డంపల్లి సర్పంచ్ వెన్నెల శేఖర్ ఆశావాహులు ఏకతాటిపై నిలబడాలి.. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా - రూ.2.87 లక్షల ఆర్థిక సాయం ఎస్ ఐ ఆర్ పై ఉన్నత స్థాయి సమీక్ష ప్రధాన ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పంపిణీ చేసిన సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్ నాగర్ కర్నూలు సరస్వతి దేవి అలంకరణలో వాసవి మాత మహాలక్ష్మి కాలనీలో వైభవంగా మహాచండీ హోమం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.రామారావు

Select Suryaa Now
ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.రామారావు

--ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్

--జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి. రామారావు

--(ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ)

కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ విజయవంతంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. రామారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి. రామారావు మాట్లాడుతూ, కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధి అని ముఖ్యంగా  ఇది చర్మానికి నరాలకు సోకు తోందని, కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి ఇంక్యుబేషన్ కాలం సగటున మూడు సంవత్సరాల పడుతుందని, కుష్టు  వ్యాధి ఎవరికైనా రావచ్చును అని దీనికి వయస్సు లింగ బేధం లేదని కుష్టు వ్యాధి వంశపారం పర్యంగా ఒకరి నుంచి ఇంకొకరికి సోకదని  ,కుష్టువ్యాధి  (బహుళా ఔషధ చికిత్స)తో పూర్తిగా నయమవుతుందని, అదేవిధంగా శరీరంపై వచ్చే మచ్చల యొక్క తీవ్ర స్థాయిని బట్టి ,ఆరు నెలల నుండి 12 నెలల లోపు మందులు వాడినచో, పూర్తిగా నయమవుతుందని, కుష్ఠు రోగులు పూర్తి సామాజిక జీవితం గడప వచ్చునని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రారంభ దశలో గుర్తించి( బహుళ ఔషధ చికిత్స) అందించినచో కుష్టు వ్యాధి గ్రస్తులు అంగవైకల్యానికి దారి తీయకుండా ఉండునని,చికిత్స పూర్తి అయిన మరియు చికిత్స తీసుకుంటున్న రోగులలో అంగవైకల్యం ఉంటే శాస్త్ర చికిత్స ద్వారా సరి చేయవచ్చునని పేర్కొనడం జరిగింది. కష్టు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ లేదా ఎరుపు రంగు లేదా రాగి రంగు కలిగి ఉంటాయని,మచ్చపై స్పర్శ ఉండదని నొప్పి ఉండదని,దేహంలో ఏ ప్రదేశం లోనేన రావచ్చునని, ఎలాంటి మచ్చలు ఉన్నచో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను సంప్రదించాలని కోరడం జరిగింది. కుష్టి వ్యాధి చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించునని,ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలకు పంపించాలని సూచించారు.కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందించే ఉచిత చికిత్సను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలో నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి, కుష్టు వ్యాధి కేసులను ముందస్తుగా గుర్తించి వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో,డాక్టర్ వేణు మాధవరావు, డాక్టర్ అరుణ, డిపిహెచ్ఎన్ఓ శేషు పద్మ, డిప్యూటీ డెమో కెవి రాజు,బద్రుఫీజియోథెరపిస్ట్, కృష్ణమూర్తి, కృష్ణ డిపిఎం ఓ లు, హెల్త్ ఎడ్యుకేటర్స్  ఖాదర్ బి, గీత, జూనియర్ అసిస్టెంట్ చెన్నయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ పర్సన్స్ పాల్గొన్నారు