మన సంస్కృతి మన సంప్రదాయం మన బతుకమ్మ, గడ్డంపల్లిలో బతుకమ్మ ఘాట్ పనులు ముమ్మరం,గడ్డంపల్లి సర్పంచ్ వెన్నెల శేఖర్
తెలకపల్లి సూర్య న్యూస్ : తెలకపల్లి మండల పరిధిలోనిగడ్డంపల్లి గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ వెన్నెల శేఖర్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్ను సిద్ధం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహిళలు, గ్రామ ప్రజలు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు వీలుగా ఘాట్ వద్ద మట్టి పనులు చేపడుతున్నారు.పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా, సంతోషంగా నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.