అనుమతి లేని రోజున వసూళ్లు చేసిన కాంట్రాక్టుపై విచారణ జరిపి, కాంట్రాక్టును రద్దు చేయాలి
కోహెడ ; కోహెడ మండల కేంద్రంలో పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఆదివారం వారసంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అలాంటి చోట శనివారం రోజున కూడా వారసంత పేరుతో పూల దుకాణాల వద్ద తైబజార్ డబ్బులు వసూలు చేయడం ఏమిటని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం ప్రశ్నించారు.
వారసంత నిర్వహించని రోజున వ్యాపారుల నుంచి తైబజార్ రుసుములు వసూలు చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? కాంట్రాక్టర్కు ఏ నిబంధనల ప్రకారం ఈ అధికారం కల్పించారు? ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ నిబంధనలకు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వసూళ్లు జరిగాయి అనుమతి లేని రోజున వసూళ్లు చేసారు కాబట్టి సదరు కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వసూళ్ల వెనుక ఎవరి ప్రమేయం ఉంది.
వారసంత లేని రోజున కూడా తైబజార్ వసూళ్లు చేయడానికి బాధ్యులెవరు? ఈ వసూళ్లకు ఎవరు సహకరించారు? వసూలైన డబ్బులు ఎవరికి చేరుతున్నాయి? ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, చిరు వ్యాపారుల కష్టార్జితాన్ని ఇష్టానుసారంగా వసూలు చేసేందుకు ఎవరికి అధికారం లేదన్నారు.వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలి.శనివారం రోజున వసూలు చేసిన తైబజార్ రుసుములు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారు ఆ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్ తిరిగి గ్రామ పంచాయతీకి చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆదివారం మినహా ఇతర రోజుల్లో తైబజార్ రుసుముల వసూలుకు సంబంధించి స్పష్టమైన అనుమతులు, నిబంధనలు ఏమిటో గ్రామ పంచాయతీ అధికారులు వెల్లడించాలని కోరారు. అధికారిక అనుమతి, వర్తించే నిబంధనల ఆధారంగానే వసూళ్లు జరగాలని, రైతులు మరియు చిరు వ్యాపారులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా చూడాలని సూచించారు ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కోహెడలో జరుగుతున్న ఈ వసూళ్ల వ్యవహారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని ఖమ్మం వేంకటేశం హెచ్చరించారు. తైబజార్ కాంట్రాక్టు నిబంధనలు, వసూళ్లకు సంబంధించిన రికార్డులు, అనుమతులను పరిశీలించి నిజానిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, ఈ వ్యవహారంలో బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలు తీసుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.