andhrapradesh
స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావులకు బీజేపీ నాయకుల వినతి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని గ్రామాల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావులను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
అనంతరం స్థానిక డిఎస్పి కార్యాలయం రోడ్లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భోగాది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రజలకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చంద్రశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ తుంగల వెంకటగిరి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి భూపతి సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కోట సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి విశ్వంసెట్టి సాంబశివరావు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు చాట్రగడ్డ రాజశేఖర్, రాష్ట్ర కౌలు రైతు సంఘం కన్వీనర్ జి.వి. నగరాయలు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మినేని ఉమామహేశ్వరరావు, సీనియర్ కార్యకర్తలు కోగంటి వెంకటేశ్వరరావు, కొడాలి సునీల్, నాగాయలంక మాజీ మండల అధ్యక్షుడు కన్నా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.