BREAKING
ప్రొద్దుటూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి! మిథున్ రెడ్డి పై డాడీ దారుణం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం శ్రీ దుర్గా దేవి అమ్మవారి వద్ద కుంకుమర్చన, అక్షరాబ్యాస పూజలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ బట్టిగా నామినేషన్ దాఖలు చేసిన బండి దీప్తి స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావులకు బీజేపీ నాయకుల వినతి రాప్తాడు ఎంపీపీ పీఠంపై టీడీపీ నేతల గురి! ఆరుగురు ఆశావహుల మధ్య పోటీ.. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం కసరత్తు వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ నూతన దేవాలయ ప్రారంభం* దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి - లక్ష్మీ నర్సింహ రెడ్డి సెవెన్ హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి రుద్ర సెక్యూరిటీ కాంట్రాక్టు రద్దు చేయాలి జూనియర్ సివిల్ జడ్జిగా వేముల హారిక ఎంపిక… - హారికకు ప్రభుత్వ విప్ విజయరమణారావు సన్మానం డిఎస్పి సూచనలు, ఆదేశాలు పటిష్ఠమైన జాగ్రత్తలు. వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.రామారావు

అన్న ఆశయాలే అండగా.. ఎంపీపీ బరిలో ‘పువ్వాడి’

Select Suryaa Now
అన్న ఆశయాలే అండగా.. ఎంపీపీ బరిలో ‘పువ్వాడి’

పామూరు ఎంపీపీ అభ్యర్థిగా పువ్వాడి వెంకటేశ్వర్లు పేరు ఖరారు

- అన్న రాధాకృష్ణ ఆశయాలే ఊపిరిగా పదేళ్ల రాజకీయ ప్రయాణం

- సొంత వ్యాపారాలను పక్కనపెట్టి పార్టీ కోసం నిరంతర అడుగులు

- కార్యకర్తకు కష్టమంటే ‘నేనున్నా’ అంటూ ముందుండే నాయకత్వం

- సేవే లక్ష్యం.. పామూరు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు

పామూరు, మేజర్ న్యూస్ : 

 అన్న ఆశయాలను భుజాన వేసుకున్నారు.. పార్టీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు.. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు.. సొంత వ్యాపారాలను సైతం పక్కనపెట్టి పదేళ్లుగా పామూరు రాజకీయాల్లో పార్టీ కోసం అడుగులు వేశారు. ఇప్పుడు ఆ రాజకీయ ప్రస్థానం మరో కీలక మలుపు తిరిగింది. పామూరు ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు పేరును ఖరారు చేశారు. దీంతో పామూరు స్థానిక రాజకీయాల్లో ‘పువ్వాడి’ మరోసారి కేంద్ర బిందువుగా నిలిచారు.

పామూరు రాజకీయాల్లో ‘పువ్వాడి’ అనేది కేవలం ఓ ఇంటిపేరు కాదని.. పార్టీ పట్ల నిబద్ధతకు, కార్యకర్తలకు అండగా నిలిచే తత్వానికి గుర్తింపుగా మారిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. స్వర్గీయ పువ్వాడి రాధాకృష్ణ టీడీపీ మండల అధ్యక్షుడిగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి గ్రామస్థాయి కార్యకర్తలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అకాల మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేస్తూ అన్న ఆశయాలు మధ్యలోనే ఆగిపోకూడదనే సంకల్పంతో పువ్వాడి వెంకటేశ్వర్లు బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

*అన్న ఆశయమే.. తమ్ముడి సంకల్పం*

అన్న సంపాదించిన పేరును రాజకీయ వారసత్వంగా అనుభవించడం కంటే దానిని బాధ్యతగా మోస్తూ వెంకటేశ్వర్లు ముందుకు సాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాధాకృష్ణ నమ్మిన పార్టీ సిద్ధాంతం, కార్యకర్తలపై చూపిన అభిమానం, ప్రజలకు సేవ చేయాలన్న తపననే తన రాజకీయ ప్రయాణానికి మార్గంగా ఎంచుకున్నారని పేర్కొంటున్నారు. పదేళ్లుగా అదే బాటలో నడుస్తూ మండలంలో పార్టీకి 

పెద్దదిక్కుగా నిలిచారని చెబుతున్నారు.

*వ్యాపారాల కంటే పార్టీనే ఎంచుకుని*

కర్నూలు జిల్లాలో ఉన్న తన వ్యాపారాలను సైతం పక్కనపెట్టి పామూరు మండలంలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించడం పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రత్యేకతగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామం ఏదైనా కార్యకర్త ఎవరైనా సమస్య తన దృష్టికి వస్తే స్పందిస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అధికారం ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని గ్రామస్థాయి శ్రేణులతో నిరంతరం మమేకమవుతూ వచ్చారని పేర్కొంటున్నారు.

*కార్యకర్తకు ‘నేనున్నా’ అనే భరోసా* 

పార్టీకి కార్యకర్తే పునాది అన్న భావనతో పువ్వాడి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్యకర్తకు కష్టమొస్తే ముందుండటం పార్టీ కార్యక్రమమంటే బాధ్యతగా తీసుకోవడం గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందంటున్నారు. అందుకే ఎంపీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

* సేవ నుంచి మండల నాయకత్వం వైపు *

పామూరు ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వు కావడం ఆ పదవికి వెంకటేశ్వర్లు పేరు ఖరారు కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయానికి తెరలేచింది. అన్న పువ్వాడి రాధాకృష్ణ నుంచి అందుకున్న రాజకీయ స్ఫూర్తిని కొనసాగిస్తూ పామూరు మండల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పువ్వాడి వెంకటేశ్వర్లు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.

నాడు అన్న పువ్వాడి రాధాకృష్ణ వేసిన రాజకీయ బాట.. నేడు తమ్ముడు పువ్వాడి వెంకటేశ్వర్లు నడుస్తున్న మార్గం. పదేళ్లుగా పార్టీ కోసం సాగించిన ప్రయాణం ఇప్పుడు ఎంపీపీ బరివరకు తీసుకొచ్చింది. అన్న ఆశయాలు అండగా కార్యకర్తల అభిమానం బలంగా పామూరు అభివృద్ధే లక్ష్యంగా పువ్వాడి వెంకటేశ్వర్లు మరో రాజకీయ అడుగు ముందుకు వేస్తున్నారు.