గ్రామ క్షేమం కోసం దుర్గాదేవి సన్నిధిలో మహా చండీ యాగం
సూర్య గంగాధర :కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి లోని మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా చండీయాగం నిర్వహించారు.గ్రామ క్షేమం కోసం పది సంవత్సరాల నుండి చండీ యాగం నిర్వహించడం జరుగుతుందని, గ్రామం లోని ప్రజలంతా ఆరోగ్యాంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో భవాని మాలాధారులు గ్రామ ప్రజలు భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు యువకులు పిల్లలు పాల్గొన్నారు.