నిరుపేదలకు ఆహార పంపిణీ చేసిన ఆకుల హరి
తణుకు, సూర్య న్యూస్ :తణుకు పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఆకుల హరి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం స్థానిక డంపింగ్ యార్డు సమీపంలోని నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు మాట్లాడుతూ ఆర్భాటాలకు దూరంగా పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో హరి చేపట్టిన సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులను ఈ విధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కోట రాకేష్, నూకల నాగేంద్ర, మాజీ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అను కుమార్, బిట్రా వినేష్, సాయి మణికంఠ తదితరులు పాల్గొన్నారు
.రిపోర్టర్. అనుకుమార్. తణుకు. పశ్చిమగోదావరి జిల్లా