నేదునూరు వెల్ఫేర్ హాస్టల్లో ఇంకుడు గుంత పనులు ప్రారంభం
కందుకూరు : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచి, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలనే లక్ష్యంతో కందుకూరు మండలం నేదునూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెల్ఫేర్ హాస్టల్లో కామన్ ఇంకుడు గుంత నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. విబిజీ రాం-జీ పథకం కింద రూ.లక్ష అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు గ్రామ సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చని తెలిపారు. దీంతో నీరు నిల్వ ఉండకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లి శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ లావణ్య, ఏపీఓ రవీందర్ రెడ్డి, టీఏ రవికుమార్, వార్డు సభ్యులు పుణ్యమూర్తి శ్యామల, మహిపాల్ రెడ్డి, హారిక జైపాల్ రెడ్డి, నీరటి అనిత యాదయ్య, యారం జేసింత బాల్ రెడ్డి, వరికుప్పల బాబు, ఎగిరిశెట్టి పద్మ శంకర్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్,మేజర్.