సిద్దిపేట ఐడీఓసీలో నేడు బతుకమ్మ సంబరాలు
!
సిద్దిపేట, :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా బతుకమ్మ కార్యక్రమం నిర్వహించనున్నారు. సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లో సాయంత్రం 4 గంటలకు ఈ వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.