BREAKING
ధురంధర్ ది రివెంజ్ చిత్రంలో అతిథి పాత్రపై స్పందించిన యామి గౌతమ్.. రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు జాతీయస్థాయి క్యారమ్స్‌ పోటీలకు జూలపల్లి పీ హెచ్ సి ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మకంటి కిరణ్‌కుమార్‌ ఎంపిక అప్పనాటి జ్ఞాపకాలను తెచ్చిన సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జోడీ.. కాఫీ విత్ కరణ్ షోలో సందడి హాలీవుడ్‌లో ఘనంగా అడుగుపెట్టిన విద్యుత్ జమ్వాల్.. స్ట్రీట్ ఫైటర్ మూవీ రివ్యూ *కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం* అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు! ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ చిత్రం అబ్‌సెషన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఏపీలో హై టెన్షన్: టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి.. ఎంపీ మిథున్ రెడ్డి కారు ధ్వంసం! నార్నియా ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ విడుదల.. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే మాయాజాలం బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్యూ2 ఫలితాల సమీక్ష: 24 శాతం వరకు పెరిగే అవకాశం.. నామినేషన్ కేంద్రాల వద్ద, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న డి.ఎస్.పి దైవప్రసాద్. జైలర్ 2 విజయంపై కమల్ హాసన్ అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ పాలీక్యాబ్ క్యూ2లో రికార్డు స్థాయి ఆదాయం.. అయినా టార్గెట్ ప్రైస్ తగ్గించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్: కారణాలివే! టెండీ లుక్స్‌తో కట్టిపడేస్తున్న శ్రీలీల.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోషూట్‌

మహిళా శక్తికి నిదర్శనం

Select Suryaa Now
మహిళా శక్తికి నిదర్శనం

జనగామ ప్రతినిధి, మేజర్ న్యూస్, జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయాన్ని సాధించవచ్చని జనగామ జిల్లా, ఘనపూర్ (స్టేషన్) మండలం, ఇప్పగూడెం గ్రామానికి చెందిన రాధిక నిరూపిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురైన నిరాశలను అధిగమించి, మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహణ ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ.40 లక్షల టర్నోవర్‌ సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.రాధిక గతంలో ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. 2018లో స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించినప్పటికీ, తన చిన్న కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా తన ప్రయత్నాలను కొనసాగించారు. 2024లో డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) ఉద్యోగానికి ప్రయత్నించగా, కేవలం 0.5 మార్కు తేడాతో ఉద్యోగావకాశాన్ని కోల్పోయారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె, ఇక జీవితంలో తాను ఏమీ సాధించలేనేమోనని బాధపడ్డారు. అయితే ఆ నిరాశే తన జీవితానికి ముగింపు కాదని, కొత్త అవకాశాల ద్వారా ముందుకు సాగవచ్చని నిరూపిస్తూ స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు.గత పదేళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతున్న రాధిక, మహిళా సంఘాల ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. అధికారుల ప్రోత్సాహం, మహిళా సంఘాల సహకారంతో మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.ఈ కేంద్రం ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.40 లక్షల టర్నోవర్‌ సాధించడం ఆమె వ్యాపార నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. మహిళలు సరైన అవకాశాలను అందిపుచ్చుకుని, పట్టుదలతో కృషి చేస్తే వ్యాపార రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని రాధిక ప్రయాణం చాటిచెబుతోంది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ప్రత్యేక చొరవతో తనకు ఈ అవకాశం లభించిందని రాధిక తెలిపారు. తనను ప్రోత్సహించి, ముందుకు నడిపించిన అధికారులకు, ప్రత్యేకంగా *జిల్లా కలెక్టర్‌కు* ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.జనగామ జిల్లా, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన ప్రియాంక మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తున్నారు. కేంద్రాన్ని ప్రారంభించిన కేవలం నాలుగు నెలల్లోనే రూ.20 లక్షల టర్నోవర్‌ సాధించడం విశేషం.రామవరం గ్రామంలో మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ప్రియాంక, అధికారుల ప్రోత్సాహంతో తన వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రూ.20 లక్షల టర్నోవర్‌ సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.మహిళా శక్తి రైతు సేవా కేంద్రం ద్వారా లభిస్తున్న అవకాశాలు తన కుటుంబ పోషణకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందుతూ కుటుంబానికి అండగా నిలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహణకు ప్రోత్సాహం అందించిన అధికారులకు, ప్రత్యేక చొరవ చూపిన *జిల్లా కలెక్టర్‌కు* ప్రియాంక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు గ్రామీణ మహిళల అభ్యున్నతికి దోహదపడుతున్నాయి.అవకాశం లభిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనే విషయాన్ని రాధిక, ప్రియాంక విజయగాథ చాటి చెబుతోంది. ఉద్యోగం ఒక్కటే ఉపాధికి మార్గం కాదని, పట్టుదలతో స్వయం ఉపాధిని ఎంచుకుంటే ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవవచ్చని వారి నిరూపిస్తున్నారు.

రిపోర్టర్ నవీన్ చారి, జనగామ