BREAKING
35వ డివిజన్‌లో టీడీపీ కూటమి అభ్యర్థి ఎద్దు శిరోమణి నామినేషన్ దాఖలు.. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలోకి మరో అభ్యర్థి రామాయణం ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రణ్‌బీర్ కపూర్ వాచ్: రాముడు, రామమందిర చెక్కుడు డిజైన్ వైరల్! --నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణం, తీగలవంతెన నిర్మాణాలు పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 80 శాతం రాయితీతో ఉద్యాన పంటలకు నీటి సరఫరా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత ఖరారు జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప

ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మేజర్ న్యూస్ :

ప్రకృతి విపత్తుగా భావిస్తున్న ఎల్‌నినో ప్రభావాన్ని ప్రజలందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. రైతులు ప్రజా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యతో కలిసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రజలందరూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 97 మంది లబ్ధిదారులకు రూ.97,11,252 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వీరిలో 58 మంది కళ్యాణలక్ష్మి, 39 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులు ఉన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని స్పీకర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభవార్త అందించనున్నారని, మరో రెండు మూడు పథకాలను అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంతో పాటు పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ, హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో వికారాబాద్‌లోని శివసాగర్ చెరువును సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.