BREAKING
పట్టణమంతా అమ్మవారి సంబరాలు.. భక్తిభావంతో శరన్నవరాత్రులు శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రామాయణం సినిమాపై ట్రోలింగ్‌పై స్పందించిన కేజీఎఫ్ స్టార్ యశ్.. నెటిజన్లకు సంచలన విజ్ఞప్తి సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కరువు పరిస్థితులను అధిగమిద్దాం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం ఏఐ, బయోటెక్, సోలార్‌లతో పాటు 40 సాంకేతికతలపై కఠిన నిబంధనలు ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ సూరి కొత్త సినిమా విశేషాలు నిరసనల వేళ దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ . షెడ్యూల్ విడుదల! బహుపాక్షిక నిధుల సమీకరణకు కెన్యా చర్చలు ముంబైలో బయటపడ్డ మరో నీటి సంక్షోభం: 35% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోకి సముద్రపు ఉప్పునీరు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ 'కాగితం పడవలు' ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలు ఆఫ్రికాలో భారీ పెట్టుబడులకు ఏఎఫ్‌సీ ప్రణాళిక

చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య

Select Suryaa Now
చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ పట్టణంలో దుండగులు కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు నిరసనగా సోమవారం లింగాలఘణపురం మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, బిఆర్ఎస్ శ్రేణులు, రజక సంఘం నాయకులు కలసి చాకలి ఐలమ్మ విగ్రహానికి క్షీరాభిషేకం (పాలాభిషేకం) నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం దుండగుల చర్యను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం గళమెత్తిన వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విగ్రహాలను కూల్చివేస్తున్న సంఘవిద్రోహ శక్తులను పోలీసులు తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్‌లో కూల్చివేసిన ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వమే తన పూర్తి ఖర్చులతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మించాలని కోరారు.పేదలు, బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే పోరాటాల్లో, ఐలమ్మ ఆశయాల సాధనలో రజకులు ఎల్లప్పుడూ ముందుంటారని నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విద్వేషపూరిత ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జ్ చౌదర్పల్లి శేఖర్, స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య రాజు, వడిచర్ల సర్పంచ్ చెరుకు కార్తీక్, ఉప సర్పంచ్ గట్టగల్ల రాజయ్య, మాజీ ఎంపీటీసీ గండి యాదగిరి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎదునూరి వీరన్న, గ్రామ శాఖ అధ్యక్షులు కేమిడి యాదగిరి, దూసరి వెంకన్న, లింగాల వెంకటేష్, గట్టగల్ల శ్రీహరి, గండి చంద్రశేఖర్, కేమిడి రాజు, బండ్రు సత్తయ్య, గట్టగల్ల నాగరాజు, వేముల శ్రీను, ఎడ్ల తిరుపతి, బాల్య సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు,రజక సంఘం ప్రతినిధులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, స్థానిక సర్పంచ్‌లు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు మరియు మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.

రిపోర్టర్, కార్తీక్ ,లింగాలఘనపూర్, జనగామ జిల్లా