మంత్రి ఫరూక్ టీడీపీ సీనియర్ నేత ఎవి సుబ్బారెడ్డి భేటి- ఎన్నికల కార్యాచరణపై సుధీర్ఘ చర్చ
సూర్య, నంద్యాల బ్యూరో:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో ఆర్ఎస్ఐఐసి మాజీ ఛైర్మెన్ ఎవిసుబ్బారెడ్డి భేటి అయ్యారు. ఇద్దరు నేతల మధ్య ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. నంద్యాలలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఎవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు మరియు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు గెలుపునకు సమన్వయంతో కృషి చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ ఛైర్మెన్ కొప్పుల శివనాగిరెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, పబ్బతి వేణు, తదితరులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*