దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సూర్య ఎండపల్లి:
ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో గ్రామంలో సర్పంచ్ సంగ రమేష్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం, ఆడబిడ్డలకు చీరలు, పసుపు, కుంకుమ, గాజుల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాష్ట్ర సీనియర్ నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి హాజరయ్యారు.మహిళలకు ముఖ్య అతిథులు, సర్పంచ్ సంగ రమేష్ కలిసి చీరలు, పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు.సంప్రదాయాలను కాపాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, గాజుల లక్ష్మణ్, గెల్లు శ్రీనివాస్, గాజుల విజయ్ పాల్గొన్నారు.వీరితో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రాజారాంపల్లి గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.