BREAKING
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయండి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం జాతీయ సరస్ ఉత్సవంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యపై ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక 86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం:

పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన

Select Suryaa Now
పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన

మదనపల్లె,మేజర్ న్యూస్ : ఏపీలో మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది.ముఖ్యంగా అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం,పుంగనూరు మున్సిపల్ చైర్మన్ పదవికి టిడిపి నుండి నలుగురు మహిళ నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి.రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్,వెంకటరమణ రాజు భార్య చంద్రకళ,ఇబ్రహీం భార్య షమీల,విశ్రాంత డి.ఎస్.పి సుకుమార్ బాబు భార్య సులోచన పేర్లు ప్రత్యేకంగా వినబడుతున్నాయి.ముఖ్యంగా కనుమకుంట కుటుంబం రాజకీయాలలో సుదీర్ఘంగా కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకుంది.తెలుగుదేశం సీనియర్ నాయకులు,విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు నిర్విరామంగా పార్టీ కార్యక్రమాలు,సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించడం,ఆలయాల అభివృద్ధికి సహకారం,విద్యార్థులు అభ్యున్నతికి విశేష కృషిచేస్తున్నారు.గతంలో ఆయన సోదరుడు,ఆయన సతీమణి సులోచనలు టిడిపి తరఫున కౌన్సిలర్లుగా విజయం సాధించి పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు ఇతర పార్టీ ప్రముఖులతో సుకుమార్ బాబు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.పార్టీకి వారు అందిస్తున్న సేవలను గుర్తించి అధిష్టానం కనుమకుంట సులోచనకు పుంగనూరు మునిసిపల్ ఛైర్ పర్సనుగా అవకాశం కల్పించాలని పలువురు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి