నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
నెల్లూరు, మేజర్ న్యూస్ : 5వ అదనపు జిల్లా కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో హాజరు..తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెప్టెంబర్ 20-09-2025 న DCMS మాజీ ఛైర్మన్ వీరి చలపతిరావు తో పాటు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మరో 18 మంది వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమంగా నమోదైన కేసుకు సంబంధించి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వీరి చలపతిరావు నెల్లూరు జిల్లా 5వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోర్టులో మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని న్యాయవాదులు, వైసీపీ లీగల్ సెల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో వైసీపీ లీగల్ సెల్ జోనల్ అధ్యక్షులు రామిరెడ్డి రోజా రెడ్డి మరియు కోరికల చంద్రశేఖర్ వై. బ్రహ్మ తేజ, యన్. శ్రావణ్ కుమార్, శ్రీమతి రమాదేవి, బలంరెడ్డి చెంచు రెడ్డి, గోమటం శ్యామాచార్యులు, CH. శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు..