నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
పురపాలక సంఘం మున్సి పల్ చైర్పర్సన్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మండపేట పురపాలక సంఘం కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ టీవీ రంగారావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం నుంచి 18వ తేదీ ఆదివారం వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చని వెల్లడించారు. మండపేట ఆలమూరు రోడ్డులోని అన్నపూర్ణ హైస్కూలును నామినేషన్ల స్వీకరణ కేంద్రంగా నిర్ణయించారు. అక్కడ ఎన్నికల అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
నామినేషన్ల స్వీకరణ వివరాలు…
అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. మండపేట ఆలమూరు రోడ్ లోని అన్నపూర్ణ హైస్కూలు లో స్వీకరిస్తారు.