BREAKING
కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ అభియోగాలు అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్ భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు. అక్షిత విద్యార్థిని నీట్ కోచింగ్ కు సర్పంచ్ ఇమ్మడి మహేష్ ఆర్థిక చేయూత రాబోయే శీతాకాలం వేళ ఉక్రెయిన్‌కు ఉపశమనం వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు ఓటుకు నోటును తిరస్కరిద్దాం.. విలువైన ఓటు కు విలువనిద్దాం... ...... విద్వాన్ జ్యోతి చంద్రమౌళి...... శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు హంగేరీ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

Select Suryaa Now
జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

జిల్లాలో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి సన్నద్ధత  

ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి, రిజర్వేషన్లు మరియు గెజిట్ నోటిఫికేషన్లు జారీ.

మార్కాపురం మేజర్ న్యూస్ 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎన్నికల ప్రధానాంశాలు మరియు షెడ్యూల్ వివరాలు:

జిల్లాలో మొదటిగా ఎంపీటీసీలు, ఆ తర్వాత జెడ్పీటీసీలు, చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించబడనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, పొదిలి తప్ప మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాలకు చెందిన 21 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.మొత్తం 100 వార్డుల్లోని 163 పోలింగ్ స్టేషన్లలో అర్బన్ లోకల్ బాడీల (యూఎల్‌బి) ఎన్నికలు ఖరారు చేయబడి, వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయని వెల్లడించారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున, అక్టోబర్ 16వ తేదీన సంబంధిత ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేయడం ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.నామినేషన్ల స్వీకరణ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు కేవలం నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. నామినేషన్లు అక్టోబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు. అక్టోబర్ 19న తనిఖీ ఉంటుందని, అక్టోబర్ 21 వరకు ఉపసంహరణ గడువని, ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితా అదే రోజున ఖరారు చేయబడుతుందని తెలియజేశారు.ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ అక్టోబర్ 28వ తేదీన జరుగుతుందని వెల్లడించారు.

ఎన్నికల సిబ్బంది శిక్షణ మరియు పకడ్బందీ ఏర్పాట్లు:

ఎన్నికలకు సంబంధించి జిల్లా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లాలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వివరాలు రెవెన్యూ మరియు పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో ఖరారు చేయబడి, బందోబస్తు ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అన్ని చర్యలు పకడ్బందీగా చేపడుతున్నామని వ్యాఖ్యానించారు.అవసరమైన చోట అదనపు సిబ్బంది, శాంతి భద్రతల పరిరక్షణకు బలగాలు, ఎం.సీ.సీ అమలుకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్.ఎస్.టీ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి (ఎం.సి.సి) లోబడి ప్రవర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ విషయంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.జిల్లాలో ప్రతి ఓటరు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని, పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, మార్కాపురం వారిచే జారీ.