BREAKING
బోడంపహాడ్ లో .. ఘనంగా మహిళా రైతుల దినోత్సవం సామాజిక చైతన్యం కోసం పిట్టలదొర వేషం.... బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. మొదటి రోజే రూ. 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న సినిమా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు.. బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శ్రీరాముని ఆశీస్సులు కోరిన యామీ గౌతమ్.. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత

Select Suryaa Now
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత

మచిలీపట్నం, మేజర్ న్యూస్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌) ద్వారా అందిన అర్జీలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు, అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సూచించారు. గురువారం పీజీఆర్ఎస్‌ అర్జీల పరిష్కార విధానాలు, అర్జీదారుల అభిప్రాయాలు, సమస్యల పరిష్కారంలో పారదర్శకత తదితర అంశాలపై ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌తో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, అర్జీల పరిష్కారం అనంతరం అర్జీదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు చేసే ఫోన్ కాల్స్‌లో ప్రతికూల స్పందనలు రావడానికి కొన్ని సందర్భాల్లో అధికారులు నమోదు చేసే ఎండార్స్‌మెంట్లలో స్పష్టత లేకపోవడం కూడా కారణమవుతోందని వివరించారు. ఆర్థికంగా సాధ్యం కాని అంశాలు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న వివాదాలు, అధికార పరిధికి చెందని సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీలను వాస్తవంగా పరిష్కరించారా, పరిష్కరించడం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలేమిటి అనే విషయాలను స్పష్టంగా నమోదు చేసేలా అధికారులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎండార్స్‌మెంట్ల నాణ్యతను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. దీనివల్ల లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, అర్జీల పరిష్కార నాణ్యతను మెరుగుపరచవచ్చన్నారు. అర్జీ పరిష్కారానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్‌ను వాట్సాప్‌ ద్వారా అర్జీదారులకు పంపించే విధానం అమలు చేస్తే, తమ సమస్య పరిష్కార స్థితి, పరిష్కారం సాధ్యం కాని కారణాలపై స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి, నిబంధనల పరిధిలో మెరుగైన పరిష్కారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అర్జీల పరిష్కారంతో సంబంధం ఉన్న అధికారులకు సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకతను పెంపొందించడం, అర్జీదారుల సంతృప్తిని మెరుగుపరచడం లక్ష్యంగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.