By సూర్య ప్రతినిధి
Updated : 15 Oct 2026 13:55 IST
Select Suryaa Now
సూర్య న్యూస్ అద్దంకి.
మున్సిపల్ మరియు ఇతర ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అద్దంకి మున్సిపల్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. కట్ట కింద పాలెం, ఎన్టీఆర్ నగర్, ప్రకాశం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల భద్రతలో భాగంగా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. రవాణా వ్యవస్థపై నిఘా ఉంచడంతో పాటు, లిక్కర్ మరియు ఇతర నగదు రూపంలోని అక్రమ రవాణాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ప్రజలు సహకరించాలని కోరారు.