BREAKING
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయండి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం జాతీయ సరస్ ఉత్సవంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యపై ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక 86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం:

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

Select Suryaa Now
ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

*మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన..!*

* *భద్రతా ఏర్పాట్లపై అధికారులకు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచనలు*

కడప,  మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU) పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మూడు స్ట్రాంగ్ రూమ్‌లు, మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి, ఎన్నికల సామగ్రి భద్రత, కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పరిశీలనలో జేసితో పాటు కడప నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, కడప డీఎస్పీ టి. భవానీ పాల్గొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

 కడప, క్రైమ్ రిపోర్టర్, వేణు.