గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ దసరా కానుక
సూర్య గంగాధర :గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ సర్పంచ్ దాసరి శంకర్ గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలతో దసరా పండగ కు కానుక ఇచ్చారు.ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో సహకరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరింత మెరుగైన సేవలు అందించాలని కోరుతూ వారు విజయదశమి పండుగను కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరుకుంటూ వారికి నూతన వస్త్రాలు అందించారు.. సిబ్బంది కి దసరా కానుక ఇవ్వడంతో గ్రామస్తులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి దేవ హద్దు రెడ్డి కార్యదర్శి మౌనిక వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు