6మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట జిల్లా పరిధిలో 6 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయచంద్ర మోహన్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాల అసలు ప్రతులు, జిరాక్స్ ప్రతులతో సహా ఈ నెల 17న ఉదయం 11 గంటలకు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావలసిందిగా కోరారు. విద్యార్హతలు, ఇతర వివరాలు మరియు దరఖాస్తు ఫారమ్ను narayanapet.telangana.gov.in వెబ్సైట్లోని Recruitment విభాగం నుండి పొందగలన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.