అనారోగ్య బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఝరాసంగం ఃఅనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కోనింటి మాణిక్రావు ఆదేశాల మేరకు ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల సంగమేశ్వర్కు మంజూరైన రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం అందజేశారు.మేదపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని వైద్య చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.30 వేల ఆర్థిక సాయం మంజూరైంది.ఈ చెక్కును ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ తదితరులు బాధితుడికి అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని నాయకులు పేర్కొన్నారు.ఆర్థిక సాయం మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కోనింటి మాణిక్రావుకు, స్థానిక నాయకులకు లబ్ధిదారుడు పట్లోళ్ల సంగమేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.