ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి -జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
దుర్గమ్మ దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న దంపతులను ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు బిల్లా కంటి హరిబాబు ఆలయ అధ్యక్షులు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు...
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: