BREAKING
దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ వైద్యులు రవికృష్ణకు పుత్రవియోగం బారేగూడ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు.. కష్టానికి దక్కిన ఫలితం ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు రిజర్వేషన్‌లో గందరగోళం.. ఆఫ్‌లైన్‌లో బీసీ-డీ, ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌..! కడప కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. బషీర్ అరెస్ట్ కళ్యాణదుర్గం వై కా పా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిణి ఖరారు. కలాం ఆశయాలు యువతకు ఆదర్శం అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఘన నివాళులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూమోళ్ల కృష్ణయ్య కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ సింగూర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రి ఫరూక్ టీడీపీ సీనియర్ నేత ఎవి సుబ్బారెడ్డి భేటి- ఎన్నికల కార్యాచరణపై సుధీర్ఘ చర్చ విక్రమార్కతో ఖతార్‌లోని భారత రాయబారి భేటీ సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి

కలాం ఆశయాలు యువతకు ఆదర్శం అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఘన నివాళులు

Select Suryaa Now
కలాం ఆశయాలు యువతకు ఆదర్శం  అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఘన నివాళులు

 

అవనిగడ్డ, అక్టోబర్ 14 మేజర్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని అవనిగడ్డలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రేపల్లె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన ప్రతిభ, క్రమశిక్షణ, నిరంతర కృషి, దేశభక్తితో దేశానికి విశేష సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, పంచాయతీరాజ్ విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఉపసర్పంచ్ గాజుల జై గోపాల్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నజీర్ భాషా, మండల పార్టీ ఉపాధ్యక్షులు గార్లపాటి గోపి, ఖాదిర్ భాషా, రియాజ్ భాషా, అన్నపరెడ్డి పరమాత్మ, మునిపల్లి ఇశ్రాయేలు, కొల్లాల మధుసూదనరావు, కొండవీటి రామ్ ప్రసాద్, చాట్రగడ్డ సుమన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.