BREAKING
భీమవరం రాజకీయాల్లో కొత్త ఎంట్రీ.. చైర్‌పర్సన్‌గా పోటీకి సిద్ధం : కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి ప్రకటన ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి : నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక బాల త్రిపూర్ణ సుందరిగా దుర్గామాత ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు* భూముల రీ సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ — కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో తీర్థయాత్రలకు ప్రత్యేక ప్యాకేజి నూజివీడు సీడ్స్ వారి ఆషా పత్తి తో అధిక దిగుబడి. • టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు. అడ్వాన్స్ వద్దు.. బకాయి జీతం చెల్లించండి! ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి ఆదర్శం: గొట్టిపాటి లక్ష్మి ధరల మంట: పండగ పూట సామాన్యుడి కంట కన్నీరు! దేవీ నవరాత్రి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ వైద్యులు రవికృష్ణకు పుత్రవియోగం బారేగూడ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు.. కష్టానికి దక్కిన ఫలితం

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు రిజర్వేషన్‌లో గందరగోళం.. ఆఫ్‌లైన్‌లో బీసీ-డీ, ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌..!

Select Suryaa Now
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు రిజర్వేషన్‌లో గందరగోళం.. ఆఫ్‌లైన్‌లో బీసీ-డీ, ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌..!

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్‌ న్యూస్‌: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు భర్తీకి సంబంధించి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ నోటిఫికేషన్లలో వేర్వేరు రిజర్వేషన్లు పేర్కొనడం అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు సంబంధించి జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుంచి వెలువడిన ఆఫ్‌లైన్‌ ప్రొసీడింగ్‌లో బీసీ-డీ రిజర్వేషన్‌ పేర్కొనగా, ఆన్‌లైన్‌లో మాత్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ చూపించడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా రాకొండ గ్రామంలోని పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని భావించిన అభ్యర్థులు రిజర్వేషన్‌ వివరాలను పరిశీలించగా, రెండు నోటిఫికేషన్లలో వేర్వేరు కేటగిరీలు కనిపించడంతో ఏ రిజర్వేషన్‌ను ప్రామాణికంగా తీసుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఒకే పోస్టుకు రెండు రకాల రిజర్వేషన్లు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారులు స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ల వివరాలు కీలకమైనవి. ఇలాంటి సందర్భాల్లో నోటిఫికేషన్లలో వ్యత్యాసాలు ఉండటం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి, రాకొండ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు వర్తించే అసలు రిజర్వేషన్‌ ఏదో స్పష్టం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అవసరమైతే ఆన్‌లైన్‌ వివరాలను సరిచేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ రిజర్వేషన్‌ వ్యత్యాసానికి కారణాలేమిటి..? ఆఫ్‌లైన్‌ ప్రొసీడింగ్‌ సరైనదా, ఆన్‌లైన్‌ వివరాల్లో పొరపాటు జరిగిందా? అనే అంశాలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.