BREAKING
86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన

భీమవరం రాజకీయాల్లో కొత్త ఎంట్రీ.. చైర్‌పర్సన్‌గా పోటీకి సిద్ధం : కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి ప్రకటన

Select Suryaa Now
భీమవరం రాజకీయాల్లో కొత్త ఎంట్రీ..   చైర్‌పర్సన్‌గా పోటీకి సిద్ధం : కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి ప్రకటన

భీమవరం, సూర్య న్యూస్: జనసేన పార్టీ సీనియర్ నేత, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భీమవరంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆమె పాల్గొని జనసైనికులు, వీర మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.

కార్యకర్తల ఆదరణకే కృతజ్ఞతలు: సమావేశంలో రామ బంగారు రోహిణి మాట్లాడుతూ.. ఇటీవల తన తండ్రి కనకరాజు సూరి అనారోగ్యానికి గురైన సమయంలో పార్టీ శ్రేణులు, ప్రజలు చూపించిన ప్రేమ, చేసిన పూజల వల్లే ఆయన త్వరగా కోలుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. 2009 ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి ఎన్నో ఒడుదొడుకులు, నష్టాలు ఎదురైనా తన తండ్రి నిరంతరం ప్రజల కోసమే పనిచేశారని, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడిచారని గుర్తుచేశారు. తమ కుటుంబంలోని అందరూ జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

'క్లీన్ & గ్రీన్ భీమవరం' లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో ప్రజలు, కార్యకర్తలు తమ కుటుంబంపై చూపిన అభిమానంతోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆశయాలు, స్ఫూర్తితో అవినీతి రహిత పాలనను అందిస్తూ.. భీమవరాన్ని "క్లీన్ భీమవరం, గ్రీన్ భీమవరం, స్వచ్ఛ భీమవరం"గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. తన తండ్రి ఏ విధంగా అయితే ప్రజా సమస్యల పరిష్కారానికి ముందున్నారో, అదే విధంగా తాను కూడా ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు.

తమ కుటుంబంలో ఒక సోదరిగా, ఒక కుమార్తెగా భావించి పార్టీ శ్రేణులు, వీర మహిళలు, ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా