మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్., ఆదేశాలతో శక్తి యాప్, ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండాయనపై విస్తృత ప్రచారం
మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి Ch సౌజన్య గారి సూచనలుతో నెల్లూరు నగరంలో శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో,పరిధిలో,శక్తి team ల ఆధ్వర్యంలో,నెల్లూరు రూరల్ శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో శక్తి app రిజిస్ట్రేషన్,అవగాహన కార్యక్రమం మరియు ,ఆత్మకూరు సబ్ డివిజన్ శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో, అవగాహన కార్యక్రమం , గూడూరు శక్తి టీమ్స్ ఆధ్వర్యంలోమరియు కావలి శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వేస్టేషన్ నందు శక్తి app రిజిస్ట్రేషన్, ఆపరేషన్ చిన్నారి తల్లి మరియు ఆపరేషన్ దండాయన మరియు మహిళలు, పిల్లలకు సంబందించిన చట్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మరియు ఇతర ప్రజా ప్రదేశాలలో మహిళలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి..
ఈ సందర్భంగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధానం, యాప్లోని భద్రతా ఫీచర్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే విధానం మరియు యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందించే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్ను వినియోగించడం ద్వారా వేగవంతమైన పోలీసు సహాయం పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, పోక్సో చట్టం (POCSO Act) అమలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. "చిన్నారుల రక్షణ కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యత." అనే సందేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం కోసం 112, చిన్నారుల రక్షణ మరియు సహాయం కోసం 1098, సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖ అందిస్తున్న భద్రతా సేవలు, సాంకేతిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ Dr. అజిత వేజెండ్ల, IPS గారు ప్రజలకు పిలుపునిచ్చారు.