BREAKING
దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నామినేషన్ నుండి పోలింగ్ వరకు బద్వేల్ వైసిపి పార్టీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయికృష్ణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నియామవళి అమలుతో ప్రముఖ విగ్రహాలకు ముసుగు. ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు వైసీపీలో చేరిన టిడిపి కార్యకర్తలు

ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు

Select Suryaa Now
ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: సామాజిక మధ్యమాలలో ప్రచారం అవుతున్న "ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీనా? లేక తెలుగుదేశం పార్టీ కార్యాలయమా? అన్న అంశంపై అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మరయు ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్,  తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందుకున్న కొన్ని నిమిషాలలోనే అసిస్టెంట్ కమీషనర్ మంజునాధ్ గౌడ్ ను విచారణ అధికారిగా కమీషనర్ నియమించి నివేదిక ఇమ్మని ఆదేశించారు. విచారణ అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామవాళి  ఉల్లంఘించినట్లు రుజువైతే నిబంధనలు ప్రకారం చర్యలుంటాయని కమీషనర్ అన్నారు.

*ఉద్యోగం నుంచి తొలగింపు*

మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ఉల్లంగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని చర్యలు చేపట్టమని కమీషనర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడిన, మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అతిక్రమించిన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సహాయం కమిషనర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు ఉద్యోగిపై చర్యలు ఉంటాయని; ఆపకాస్ ఉద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగి అయితే నిబంధనలు మేరకు ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగి అయితే సిసిఏ రూల్స్ ప్రకారం, ఎన్నికల నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని కమీషనర్ అన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంసిసి ఇంచార్జ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ సింగ్ ను కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశించారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా