BREAKING
చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్!

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ — కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్

Select Suryaa Now
కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా  ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ  — కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా

ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ

— కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్

కర్నూలు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలు సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ పేర్కొన్నారు.

ఇండియన్ బ్యాంక్ మైక్రోసైట్ బ్రాంచ్ మేనేజర్ బి. శృతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, బీమా పథకాల కింద అర్హులైన ఇద్దరు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ శ్రీధర్ రావు, ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలు:

1. ఖాజా బాషా (భర్త): బుధవారపేటకు చెందిన దివంగత షభానా బీమా పరిహారంగా రూ.2 లక్షల చెక్కును అందుకున్నారు.
2. అరవింద్ (కుమారుడు): దిన్నెదేవరపాడుకు చెందిన దివంగత మరియమ్మ బీమా పరిహారంగా రూ.2 లక్షల చెక్కును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎల్డీఎం పి. మోహన్ మాట్లాడుతూ, అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు బీమా పరిహారం ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు. అతి తక్కువ వార్షిక ప్రీమియంతో అందుబాటులో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు, పథకం నిబంధనలకు లోబడి రూ.2 లక్షల బీమా పరిహారం లభిస్తుందని వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.1 లక్ష వరకు బీమా ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.

ఈ పథకాల వార్షిక ప్రీమియంలు వరుసగా రూ.436, రూ.20 మాత్రమేనని, అర్హులైన ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకాలపై అవగాహన పెంచుకొని తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇండియన్ బ్యాంక్ మైక్రోసైట్ బ్రాంచ్ మేనేజర్ బి. శృతి రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడానికి ఇండియన్ బ్యాంకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల్లో బీమా పథకాలపై అవగాహన పెంపొందించి, మరింత మందిని ఈ పథకాల పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా, అర్హులైన స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళలు, మరియు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలలో చేరాలని DRDA పీడీ శ్రీధర్ రావు  తెలిపారు.