BREAKING
ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్! 6మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం రోబోటిక్ సర్జరీతో 25 ఏళ్ల యువతికి విజయవంతంగా చికిత్స పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించిన యశోద ఆసుపత్రి వైద్యులు స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు పరిశీలన గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ దసరా కానుక ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. ప్రత్యేక పూజలు చేసిన 'విరోష్' జంట! అద్దంకిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అనారోగ్య బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి -జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్' ట్రైలర్ రిలీజ్.. వివాదం తర్వాత మారిన టైటిల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కడప కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు

ధరల మంట: పండగ పూట సామాన్యుడి కంట కన్నీరు!

Select Suryaa Now
ధరల మంట: పండగ పూట సామాన్యుడి కంట కన్నీరు!

పండగ వచ్చిందంటే ఒకప్పుడు పల్లెల్లో, పట్టణాల్లో సంబరాలు అంబరాన్నంటేవి. కానీ నేడు పండగ పేరు వింటేనే పేద, మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఐజ మండల పరిధిలో గత కొద్ది రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది.

ఒకప్పుడు వందల రూపాయలతో ఘనంగా జరుపుకున్న పండుగలు, నేడు వేలకు వేలు గుమ్మరించినా కనీస అవసరాలు కూడా తీరని దుస్థితికి చేరాయి. నూనెలు, పప్పులు, కూరగాయల నుంచి మొదలుకొని పూజా సామాగ్రి వరకు ప్రతి వస్తువు ధర రెట్టింపు కావడంతో ప్రజల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. రోజువారీ కూలీలతో పొట్టపోసుకునే కుటుంబాలు పండగ పూట పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.

ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే అధికారులు 'ఎల్ నినో ప్రభావం', 'దిగుబడి తగ్గింది' అంటూ సాంకేతిక కారణాలు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నా తనిఖీలు చేపట్టే నాథుడే కరువయ్యాడు.

"ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి నిత్యావసరాల ధరలను అదుపు చేయాలి. రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సరుకులను పంపిణీ చేసి, మార్కెట్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తేనే పేదల ఇళ్లలో పొయ్యి వెలుగుతుంది" అని మండల వాసులు వేడుకుంటున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి సామాన్యుడికి పండగ పూట ఊరట కల్పించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.