ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి ఆదర్శం: గొట్టిపాటి లక్ష్మి
భారత మాజీ రాష్ట్రపతి, 'భారతరత్న' డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలాం దేశానికి అందించిన విశేష సేవలను ఆమె స్మరించుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం దేశ రాష్ట్రపతిగా భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా నలుదిశలా సాటి చెప్పారు. తన అద్భుతమైన ప్రసంగాలు, ఆలోచనలతో కోట్లాది మంది యువతలో ప్రేరణ మరియు స్ఫూర్తిని నింపిన గొప్ప మహనీయుడు ఆయన అని అన్నారు. ఒక సామాన్య స్థాయి నుంచి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' పొందే స్థాయికి ఎదిగిన ఆయన జీవిత ప్రస్థానం ప్రతీ ఒక్కరికీ మార్గదర్శకం" అని కొనియాడారు.