BREAKING
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయండి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకాంత్‌రెడ్డికి ఆహ్వానం జాతీయ సరస్ ఉత్సవంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యపై ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక 86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం:

ప్రజలకు అందుబాటులో.. కార్యకర్తలకు అండగా.. అధిష్ఠానం విశ్వాసంతో కీలక బాధ్యతల్లో ఆరిమిల్లి!

Select Suryaa Now
ప్రజలకు అందుబాటులో.. కార్యకర్తలకు అండగా.. అధిష్ఠానం విశ్వాసంతో కీలక బాధ్యతల్లో ఆరిమిల్లి!

తణుకు,సూర్య న్యూస్ : ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి.. మరోవైపు రాష్ట్రస్థాయి రాజకీయ బాధ్యతలు.. ఇంకోవైపు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్య సంబంధాలు.. ఇలా విభిన్న బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనదైన రాజకీయ ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవతో పాటు పార్టీ అధిష్ఠానం అప్పగించిన కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజకీయంగా తన పరిధిని విస్తరించుకుంటున్నారు.

అభివృద్ధిలో ఆరిమిల్లి ప్రత్యేక ముద్ర!

తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న ఆరిమిల్లి రాధాకృష్ణ, కూటమి ప్రభుత్వ సహకారంతో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. రహదారుల నిర్మాణం, వైద్య సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల అత్తిలి మండలంలో రూ.15.94 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

గతంతో పోలిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై ఆరిమిల్లి దృష్టి సారిస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారే అవకాశముంది.

ప్రజల మధ్యే.. కార్యకర్తలకు భరోసాగా!

ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం ఆరిమిల్లి నాయకత్వంలోని ప్రత్యేకతగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి వచ్చే వినతులు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా పార్టీ సంస్థాగత బలోపేతంపైనా దృష్టి సారించడం ఆయన రాజకీయ కార్యాచరణలో మరో ముఖ్యాంశంగా కనిపిస్తోంది.

అధిష్ఠానం విశ్వాసంతో రాష్ట్రస్థాయిలో కీలక పాత్ర!

తణుకు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడిగా, జోనల్ ఇన్‌చార్జిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన రాష్ట్రస్థాయి బాధ్యతలను నిర్వహించడం ఆయనకు లభిస్తున్న సంస్థాగత ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఆయన నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తోంది.

12 ఏళ్ల తర్వాత జనరల్‌కు చైర్మన్ పీఠం.. ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు!

దాదాపు పన్నెండేళ్ల అనంతరం తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఏర్పడిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అధికార కూటమిలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కూటమిలో పార్టీ విధేయతకు ప్రాధాన్యం లభిస్తుందా? ప్రజాదరణ, సామాజిక సమీకరణాలు అభ్యర్థి ఎంపికను నిర్ణయిస్తాయా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

కష్టకాలంలో నిలిచిన విధేయులకే అవకాశం?

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో పార్టీ విధేయతకు అధిష్ఠానం ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పదవులు, అధికారాలు లేకున్నా పార్టీ జెండాను భుజాన మోస్తూ, నాయకత్వానికి అండగా నిలిచిన వారిని గుర్తించాలనే అభిప్రాయం అధిష్ఠానం స్థాయిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే పార్టీ విధేయతతో పాటు ప్రజాదరణ, రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కూడా అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారనున్నాయి.

ఆరిమిల్లి అభిప్రాయమే కీలకమా?

నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభిప్రాయానికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో ప్రాధాన్యం లభించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొనసాగిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా అభ్యర్థి ఎంపికలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూటమి అధిష్ఠానం తీసుకునే నిర్ణయం తణుకు రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

అభివృద్ధే విజయానికి బాట వేస్తుందా?

కూటమి ప్రభుత్వ హయాంలో చేపడుతున్న అభివృద్ధి పనులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారతాయని అధికార పక్ష నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా తమ బలాన్ని మరింత పెంచుతాయని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అభివృద్ధి పనులతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం, అభ్యర్థుల ప్రజాదరణ, వార్డులవారీ రాజకీయ సమీకరణాలు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి.

ఏదేమైనా నియోజకవర్గ అభివృద్ధిలో దూకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, కార్యకర్తలతో అనుబంధం, రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలతో ఆరిమిల్లి రాధాకృష్ణ తనదైన రాజకీయ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నెండేళ్ల నిరీక్షణ అనంతరం జనరల్ కేటగిరీకి కేటాయించిన తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించే అదృష్టవంతులు ఎవరు? కూటమి అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది? అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.

రిపోర్టర్.అనుకుమార్.తణుకు. ...పశ్చిమగోదావరి జిల్లా. …