బారేగూడ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు.. కష్టానికి దక్కిన ఫలితం
సూర్య బెజ్జుర్:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని బారేగూడ గ్రామానికి చెందిన డోకే మహేష్కు ఎంబీబీఎస్ (MBBS) సీటు లభించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నో రోజులుగా కష్టపడి చదివిన మహేష్కు వైద్య విద్యలో సీటు రావడంతో అతని శ్రమకు తగిన ఫలితం దక్కిందని తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.చిన్ననాటి నుంచి పట్టుదలతో చదువుతూ వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో అడుగుపెట్టడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.మహేష్ భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి పేదలకు సేవలందించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆకాంక్షించారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని మహేష్ విజయం నిరూపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.