రైల్వే శాఖ ఆధ్వర్యంలో తీర్థయాత్రలకు ప్రత్యేక ప్యాకేజి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటు లోకి తీసుకొచ్చిందని తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అక్టోబర్ 24న తేదీ నుండి డిసెంబరు 01వ తేదీ లలో 3 ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ఐ ఆర్ సి టి సి జాయింట్ జనరల్ మేనేజర్ జి.సోమ శేఖర్ నాయుడు చిత్తూరు రైల్వే స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు. బైధ్యనాథ్ ధామం తో కూడిన అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్ర పూరి, కోణార్క్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ బైద్యనాథ్ ధామ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో కూడిన ఈ ప్రత్యేక పర్యాటక యాత్ర అక్టోబర్ 24న ప్రారంభమై నవంబర్ 02 వరకు కొనసాగుతుందని,.ఈ యాత్రకు ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ ప్యాsకేజీ ధర రూ.17,000, 3 ఏసీ క్లాస్ ప్యాకేజీ ధర రూ.26,400,, 2 ఏసీ క్లాస్ ప్యాకేజీ ధర రూ.34,400 నిర్ణయించబడిందని, ఈ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. 2. సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ఉజ్జయిని ,మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్, ద్వారక ,నాగేశ్వర్, సోమనాథ్ , పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (ఘృష్ణేశ్వర్). ఈ యాత్ర నవంబర్ 10వ తేదీన ప్రరంభమై నవంబర్ 20 వరకు నడుస్తుంది. వ్యక్తికి స్లీపర్ క్లాస్ టికెట్టు ధర 18,000, 3ఏసీ ధర 27,400, 2ఏసీ ధర 35,500 ఉంటుందని. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా వెళ్తుంది. 3. అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర అరుణాచలం (తిరువణ్ణామలై), చిదంబరం, తిరుచ్చి (శ్రీరంగం), తంజావూరు, రామేశ్వరం , మధురై, కన్యాకుమారి. ఈ యాత్ర నవంబర్ 23వ తేదీన ప్రారంభమై డిసెంబరు 01వ తేదీ వరకు నడుస్తుంది. దీనికి ఒక్కొకరికి స్లీపర్ క్లాస్ టికెట్టు ధర 15,800, 3 ఏసీ క్లాస్ టికెట్ ధర రూ. 23,200, 2 ఏసీ క్లాస్ టికెట్ ధర రూ. 29,600,ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ప్రతి రైలు లో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉంటారు. రైలు, బస్సు, హోటల్ సౌకర్యాలు అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం), త్రాగునీరు ఉచితం.ప్రతి కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ మరియు సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది.ప్రతి ప్రయాణికుడుకి ప్రయాణ బీమా ఉచితం,రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు పర్యాటక ఎస్కార్టు పర్యవేక్షణలో ప్రయాణం పూర్తిగ ఉచితమని తెలిపారు. • తమిళనాడు, • కర్ణాటక, • కేరళ, • ఉత్తరప్రదేశ్, • గుజరాత్, • మహారాష్ట్ర, • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖ విహార పుణ్యక్షేత్రాలను కలుపుతూ షార్ట్ టర్మ్ టూర్ ప్యాకేజీలు అంధుబాటులో కలవు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాల కోసం 9281495853, 828793231, 9281030785, 9281030773 ఫోన్ నెంబర్స్ నందు సంప్రదించగలరని మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు రైల్వే స్టేషన్ ముత్తు కుమార్, ఏరియా మేనేజర్ ఎన్. అశోక్ కుమార్, క్యాటరింగ్ ఇంచార్జ్ జి.మురళి మోహన్ టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.