నూజివీడు సీడ్స్ వారి ఆషా పత్తి తో అధిక దిగుబడి. • టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు.
సూర్య , మంచిర్యాల జిల్లా ప్రతినిధి: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వారి ఆషా పత్తి తో రైతులు అధిక దిగుబడులు పొందుతారు అని
టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు అన్నారు. గురువారం కాశిపేట మండలం లోని పల్లంగూడ గ్రామం లోని ఎంబాడి శ్రీనివాస్ ఆద్య పంట పైన మెగా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా
టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు మాట్లాడుతూ.... మారుతున్న కాలానికి అనుగునంగా ఈ విత్తనం తయారుచేయడం జరిగిందని అన్నారు. ఈ విత్తనం తో రైతులకు అధిక దిగుబడి వస్తుంది. పెద్ద కాయలు, గొలుసు కట్టు కాత, తక్కువ రోగాలు, మంచి ఆరోగ్య వంతమైన పంట, ఎక్కువ కాయలతో పూత వస్తుందిని తక్కువ పెట్టుబడి ఉంటుందని వివరించారు. అనంతరం ఇంతటి మంచి విత్తనం అందించిన నూజివీడు సీడ్స్ వారికి రైతులంతా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రైతుల శ్రీనివాస్ కంపెనీ మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.