ప్రముఖ వైద్యులు రవికృష్ణకు పుత్రవియోగం
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యులు గుర్రాల రవికృష్ణ, సునంద దంపతుల పెద్ద కుమారుడు సాయిప్రియన్ గురువారం మృతి చెందారు. గత నెల 30వతేది సాయి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. సాయి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నంద్యాల పట్టణంలో పద్మావతినగర్ లో ఆయన స్వగృహంలో సాయి పార్ధివ దేహాన్ని ఉంచారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మాజీ ఆరసి ఛైర్మెన్ ఎవిసుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, ఎవిఆర్ ప్రసాద్ లతో పాటు పలువురు ప్రముఖులు సాయి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
కుటుంబసభ్యులను పరామర్శించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*