సుల్తాన్పూర్లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి
సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పత్తి సాగు చేస్తున్న రైతులతో TGSPDCL సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ శ్రీమతి ఉమా హారతి ఎన్. ముఖాముఖి సమావేశమయ్యారు.
రైతుల వ్యవసాయ విద్యుత్ అవసరాలు, సరఫరాలో అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, అంతరాయాలను తక్షణమే పరిష్కరించాలని, దెబ్బతిన్న డీటీఆర్లను త్వరితగతిన మార్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎండీ అధికారులకు సూచించారు