పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన!
???? బ్రేకింగ్ న్యూస్
పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన!
14 కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం.. వన్‌టౌన్ పోలీసుల చర్యలు
మదనపల్లె, అన్నమయ్య జిల్లా:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో భూ కబ్జాలు, మోసాలకు సంబంధించిన పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి సులోచనను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై మదనపల్లె వన్‌టౌన్, టూటౌన్, తాలూకా పోలీస్స్టేషన్లలో 14 చీటింగ్ కేసులతో పాటు భూ కబ్జా, హత్యాయత్నం వంటి కేసులు నమోదైనట్లు సమాచారం. ఆమెపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిసింది.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
సులోచనను అదుపులోకి తీసుకోవడంతో మదనపల్లె ప్రాంతంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులకు సంబంధించి పోలీసుల తదుపరి చర్యలు, దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలపై ఉత్కంఠ నెలకొంది.