BREAKING
పట్టణమంతా అమ్మవారి సంబరాలు.. భక్తిభావంతో శరన్నవరాత్రులు శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రామాయణం సినిమాపై ట్రోలింగ్‌పై స్పందించిన కేజీఎఫ్ స్టార్ యశ్.. నెటిజన్లకు సంచలన విజ్ఞప్తి సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కరువు పరిస్థితులను అధిగమిద్దాం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో స్టార్ హీరోయిన్ త్రిష.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం ఏఐ, బయోటెక్, సోలార్‌లతో పాటు 40 సాంకేతికతలపై కఠిన నిబంధనలు ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ సూరి కొత్త సినిమా విశేషాలు నిరసనల వేళ దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ . షెడ్యూల్ విడుదల! బహుపాక్షిక నిధుల సమీకరణకు కెన్యా చర్చలు ముంబైలో బయటపడ్డ మరో నీటి సంక్షోభం: 35% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోకి సముద్రపు ఉప్పునీరు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ 'కాగితం పడవలు' ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలు ఆఫ్రికాలో భారీ పెట్టుబడులకు ఏఎఫ్‌సీ ప్రణాళిక

వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందే

Select Suryaa Now
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందే

పెద్దవంగర, మేజర్ న్యూస్, వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వాల్సిందేనని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెద్దవంగర మండలంలోని వడ్డేకొత్తపల్లి 33/ 11 కెవి సబ్ స్టేషన్ దగ్గర బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలనే ఉద్దేశంతో తొర్రూర్ - వలిగొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నమ్మించి నయవంచన చేసిందని, రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి కనీసం 6 నుండి 10 కోతల్లేని కరెంటు  కూడా ఇవ్వలేని, ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని, రైతుల పంటలు చివరి దశలో ఉన్నాయని ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా రాలేక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం కరెంటు ఇవ్వక రైతులను ఆందోళనలకు గురి చేస్తుందని, రైతుల యొక్క బాధలు వర్ణనాతీతమని, ఎండిపోయిన పంటలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని, కరెంటు కోతలతో రైతులను ఆగం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడితే, మంత్రులు మాత్రం మరొక రకంగా మాట్లాడుతున్నారని ఇది వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వెనకాడవోమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, శ్రీరామ్ సంజయ్, కనుకుంట్ల వెంకన్న, శ్రీరామ్ సుధీర్, తల్లిదండి సుధాకర్ రాసాల సమ్మయ్య మనపురం రవి బొమ్మిడి కృష్ణారెడ్డి సర్పంచ్ లు దంతాలపల్లి పరశురాములు, పటేల్ నాయక్, కాసాని హరీష్, కవిత యాకన్న, ప్రదీప్, నాయకులు వెంకన్న, పూర్ణచందర్, బాలు, భాస్కర్, పూల్ సింగ్, కుమారస్వామి, గంగాధర్, విజయ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, వీరన్న, బిక్షపతి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;రామ్మూర్తి  ,జనగామ జిల్లా