మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి-జీడికల్ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్
లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్ముకొని మద్దతు ధర పొందాలని జీడికల్ గ్రామ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్ కోరారు. మండలంలోని జీడికల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, మట్టి పెళ్లలు లేకుండా శుభ్రం చేసుకొని, ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన తేమ శాతం ఉండేలా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ తదితర మౌలిక వసతులు కల్పించాలని, ధాన్యం తూకంలో జాప్యం లేకుండా చూడాలని నిర్వాహకులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ నరేష్, వివోలు నీలం సునీత, కవిత, ఐకేపీ సిబ్బంది, స్థానిక రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ; కార్తీక్, లింగాల గణపురం, జనగామ జిల్లా