BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా కాన్‌కార్ లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు ఎంపీ బాలశౌరి కృషి

Select Suryaa Now
మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా కాన్‌కార్ లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు ఎంపీ బాలశౌరి కృషి

మచిలీపట్నం, మేజర్ న్యూస్: మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ డీప్ వాటర్ పోర్టుకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి చేస్తున్నారు. లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ఆయన, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్‌కార్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ కుమార్ పాండాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాన్‌కార్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం మచిలీపట్నంలో లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నందున, పోర్టు ప్రాంతంలో కాన్‌కార్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సంస్థ సీఎండీ అజిత్ కుమార్ పాండా త్వరలో మచిలీపట్నం పోర్టును సందర్శించి, గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ప్రారంభానికి అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని ఎంపీకి తెలియజేశారు. పోర్టుకు అనుబంధంగా లాజిస్టిక్స్‌, గిడ్డంగులు, రవాణా, తయారీ రంగ పరిశ్రమలను తీసుకురావడం ద్వారా సముద్ర వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతో బాలశౌరి సంబంధిత సంస్థలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇటీవల మచిలీపట్నం ప్రాంతంలో గోవా షిప్‌యార్డ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో, కాన్‌కార్ లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ కూడా కార్యరూపం దాలిస్తే పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. సరుకు రవాణా, నిల్వ, పంపిణీ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా ఈ ప్రాజెక్టు తదుపరి దశలు ముందుకు సాగనున్నాయి.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.