BREAKING
బ్రిటన్ మార్కెట్లలో బోవాజ్ వీన్‌స్టెయిన్ వ్యూహం.. ఆక్టివిస్ట్ పెట్టుబడులపై కొత్త చర్చ టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

మానవత్వపు.. మహా శిఖరం..!

Select Suryaa Now
మానవత్వపు.. మహా శిఖరం..!
  • మొహామ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు..
  • సకల జనుల సేవే అయన జీవనం..
  • సూఫీ పరంపరకు అయన నిలువెత్తు నిదర్శనం..
  • నేడు ఖలీల్ బాబు పుట్టినరోజు వేడుక..
  • ఏటికేలో  వైద్య, రక్త దాన శిభిరాలు..

విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్: సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం, మనిషి ధర్మం.. ఈ మూడు ధర్మాలు 'మానవత్వం' అనే మహోన్నత పథంపై ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రపంచం శాంతి, సామరస్యతతో మనుగడ సాగించాలంటే సాటి మనిషి పట్ల చూపించే మానవత్వందే ప్రధాన భూమిక. అటువంటి మానవత్వపు మహా శిఖరం డాక్టర్ మొహమ్ముద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ(ఖలీల్ బాబు). తన తండ్రి హుజూర్ హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా(చీమల పాడు) వెంట నడుస్తూ సూఫీ పరంపర వారసత్వంలోకి అడుగుపెట్టిన ఖలీల్ బాబు, సకల జనుల సేవే తన జీవనంగా మానవత్వపు పరిమిళాలను నలుదిశలా వ్యాప్తి చేస్తున్నారు. ఒక వైపు హజరత్ ఖాదర్ బాబా వారి సేవకునిగా దర్గా దర్భార్ ఆధ్యాత్మిక భాద్యతలు నిర్వర్తిస్తూ, మరో వైపు ఏటికే సంస్థ ద్వారా సామాజిక సేవలను అందిస్తున్నారు.  అనాధ వృద్ధులకు అండగా, అన్నార్తులకు 'అక్షయ పాత్ర'  గా, నిరుపేదలకు 'ఆపన్న హస్తం' గా.. అమ్మగా, అన్నగా, నాన్నగా ఎవరు ఎలా భావిస్తే వారికి అలా ఆత్మీయతో సేవలు అందించడం ఖలీల్ బాబు దిన చర్యలో భాగం. అర్ధరాత్రి ఆకలితో వచ్చిన మనిషికైనా అన్నం పెట్టి, ఆతిధ్యం ఇవ్వడం, కష్టాల్లో వచ్చిన వారికి తోడుగా నిలవడం ఆయన మానవత్వపు సేవలకు నిదర్శనం. అందుకే అయన గురించి తెలిసిన వారు ఖలీల్ బాబును మానవత్వపు మహా శిఖరంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఒక చేత్తో చేసిన సాయం మరొక చేయికి తెలియకూడదని అంటాం, అలాగే ఖలీల్ బాబు ఎప్పుడూ తాను ఒకరికి చేసిన సాయాన్ని ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోరు. అయన సేవలను చూసిన వారు అయనలాగే పది మందికి సాయం చేయాలన్న ధృక్పదాన్ని పెంపొందించుకోవాలని మాత్రమే ఆయన కోరుకుంటారు. అందుకే తన చర్యలు, వ్యక్తిగత జీవన విధానం అందరికీ ఆదర్శంగా ఉండాలని అనునిత్యం తనను తాను సంస్కరించుకుంటూ ఉంటారు. అయన బోధలు చేయరు, ఆయన మౌనంగా సేవలనే భోధలుగా ఆయన్ని అనుసరించి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ముఖంపై చిరునవ్వు, ఎవరి బాధలైనా విన్నప్పుడు గువ్వ కన్నుల్లా ఆయన కళ్ళల్లో సుడులు తిరిగే కన్నీళ్లు తప్ప, కోపం అనే మాటకు తావులేని మహోన్నత మానవత్వం ఖలీల్ బాబు వ్యక్తిత్వం.  కుల, మత, ప్రాంత వైశమ్యాలు లేని శాంతి, సామరస్యత తో కూడిన మంచి సమాజంగా ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలనేదే ఆయన చేసే సేవల ముఖ్య ఉద్దేశ్యం. దీన్ని ప్రతీ ఒక్కరూ ఆచరిస్తే విశ్వ శాంతి గోచరమిస్తుందని ఖలీల్ బాబు తన ప్రేమికులకు ఎప్పుడూ చెప్పే సందేశం. ఉన్నంతలో తోటి వారికి సాయం చేయాలని, పొరుగు వారితో ప్రేమగా ఉండాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను భక్తి భావాలతో పూజించాలని, వారిని వృద్ధాప్యంలో నిరాధారణ, నిరాశ్రయులను చేయొద్దని ఖలీల్ బాబు తన సేవల వెనుక ముఖ్య ఉద్దేశ్యాన్ని తన ఆచరణల ద్వారా సందేశమిస్తూ ఉంటారు. అందుకే ఖలీల్ బాబు గురించి తెలిసిన వారు ఆయన్ని 'మానవత్వపు - మార్గ దర్శి' అని కొనియాడుతూ ఉంటారు.

నేడు అనగా ఆదివారం ఖలీల్ బాబు పుట్టినరోజు. ఆ సందర్బంగా అయన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ నాలుగు అక్షరాల వర్ణన. కాగా పుట్టినరోజు వేడుకలు సందర్బంగా ఏటికే ఓల్డ్ ఏజ్ హోమ్ లో  ప్రత్యేక వైద్య శిభిరం, రెడ్ క్రాస్ వారి ద్వారా రక్త దాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఖలీల్ బాబు ప్రేమికులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు రాత్రికి బాబా దర్బార్ లో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.